ఇంగ్లండ్(England)తో జరిగిన తొలి T20లో టీమ్ఇండియా(Team India) గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 133 పరుగుల టార్గెట్ను 12.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఘనవిజయం సాధించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్(Eden Garden)వేదికగా జరిగిన ఈ మ్యాచులో భారత్ యంగ్ ఓపెనర్ అభిషేక్ వర్మ(79) పూనకం వచ్చినట్లు చెలరేగి ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. అభి దెబ్బకు ఇంగ్లిష్ బౌలర్లు కంగుతిన్నారు. ఈ క్రమంలో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు అభిషేక్. 8 సిక్సర్లు, 5 ఫోర్లతో ఈ యంగ్ ఓపెనర్ ఎడాపెడా బౌండరీలు బాదాడు. ఇక మరో ఓపెనర్ సంజూ శాంసన్ 26 రన్స్ చేయగా..సూర్య డకౌట్ అయ్యాడు. తిలక్ వర్మ (19*), పాండ్య (3*) రన్స్ చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 2, రషీద్ ఒక వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. భారత బౌలర్ల ధాటికి పరుగులు సాధించలేక అష్టకష్టాలు పడింది. దీంతో 20 ఓవర్లో 132 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీయగా.. అర్ష్ దీప్ సింగ్, పాండ్య, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ బట్లర్ (68) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. కాగా భారత బౌలింగ్లో రాణించిన వరుణ్ చక్రవర్తి 23/3కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఈనెల 25న చెన్నై(Chennai)లో జరగనుంది.
Abhishek Sharma can eat 10 Shubhman Gill along with 10 Vadapav in breakfast 🙌#INDvsENG pic.twitter.com/SRceEAIttf
— KohliForever (@KohliForever0) January 22, 2025






