ఇక హ్యాపీగా రిటైర్ అవ్వొచ్చు.. రష్మిక షాకింగ్ కామెంట్స్

నేషనల్ క్రష్, టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) తాజాగా తన సినిమా ఈవెంట్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కెరీర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ గా సాగుతున్న సమయంలో రిటైర్మెంట్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఛావా ట్రైలర్ రిలీజ్

బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ (Vicky Kaushal)తో కలిసి రష్మిక  ‘ఛావా (Chhaava)’ అనే పీరియాడిక్‌ డ్రామా సినిమాలో నటించింది.  ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ముంబయిలో ట్రైలర్‌ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో మాట్లాడుతూ రష్మిక రిటైర్మెంట్‌ గురించి కామెంట్స్ చేసింది. ఈ సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయిగా నటించే అవకాశం రావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపింది.

ఇక రిటైర్ అవ్వొచ్చు

“ఛావాలో ఏసుబాయిగా నటించడం చాలా సంతోషంగా ఉంది. ఒక నటిగా నాకు ఇంతకు మించి ఇంకేం అవసరం లేదనిపిస్తోంది. అందుకే ఈ చిత్రం తర్వాత హ్యాపీగా రిటైర్ అవ్వొచ్చని డైరెక్టర్ కు చెప్పాను. అంత గ్రేట్ క్యారెక్టర్ ఇది. షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా సార్లు ఎమోషనల్ అయ్యాను. ఇక విక్కీ కౌశల్ ఈ సినిమాలో నాకు దేవుడిలా కనిపించాడు. ఏసుబాయి పాత్ర కోసం ఎన్నో రిహార్సల్స్‌ చేశాను.’’ అని రష్మిక చెప్పుకొచ్చింది.

గాయంతోనే ఈవెంట్ కు

ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ (Chhatrapati Sambhaji Maharaj) జీవితం ఆధారంగా లక్ష్మణ్‌ ఉటేకర్‌ (Laxman Utekar) ఛావా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో శంభాజీగా విక్కీ కౌశల్ నటిస్తుండగా.. అతడి భార్య ఏసుబాయిగా రష్మిక కనిపించనుంది. తాజాగా విడుదల చేసిన దీని ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల జిమ్ లో గాయపడిన రష్మిక ఈ ఈవెంట్ గాయంతోనే వచ్చింది. స్టేజ్ పై నడవడానికి విక్కీ సాయం చేశాడు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *