144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా (Kumbh Mela 2025) ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ఈ కుంభమేళాకు వేడుకయింది. ఈ మేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. రోజు లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
ఇప్పటివరకు 10 కోట్లకుపైగా భక్తులు
గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈరోజు మధ్యాహ్నం వరకు 30 లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు వెల్లడించింది. మకర సంక్రాంతి రోజు దాదాపు 3.5 కోట్ల మంది సంగమంలో స్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది.
🚨 More than 1 crore (10 million) people visited on day 1 of Maha Kumbh Mela 2025. pic.twitter.com/JdPpDBT1D5
— Indian Tech & Infra (@IndianTechGuide) January 13, 2025
45 కోట్ల భక్తులు వస్తారని అంచనా
ఈ సారి కుంభమేళాకు 45 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేయగా.. ఇప్పటివరకు 40 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చినట్లు సమాచారం. జనవరి 13వ తేదీన మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగనుంది. మొత్తం 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈసారి కుంభమేళా ద్వారా 12 లక్షల మందికి తాత్కాలిక ఉద్యోగాలు లభించాయి.






