నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna).. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinivas) దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమా షూటింగ్ ఓ షెడ్యూల్ ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ మేళాలో పూర్తయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ క్రేజీ అప్డేట్ షేర్ చేశారు. ఈ చిత్రంలో బాలయ్యతో కలిసి నటించనున్న హీరోయిన్ ను ప్రకటించారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..?
The talented and happening @iamsamyuktha_ is on board for #Akhanda2 – Thaandavam ✨
Shoot in full swing 💥
Grand release worldwide for Dussehra on SEPTEMBER 25th, 2025 ❤🔥
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu @MusicThaman @14ReelsPlus @RaamAchanta… pic.twitter.com/Snr685kUl7
— 14 Reels Plus (@14ReelsPlus) January 24, 2025
అఖండ-2 (Akhanda 2 Thandavam) సినిమాలో బాలయ్యతో కేరళ బ్యూటీ నటించనుంది. మలయాళీ భామ సంయుక్త మేనన్ ఈ చిత్రంలో నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘టాలెంటెడ్ యాక్టర్ సంయుక్తకు అఖండ 2 ప్రాజెక్ట్‌లోకి వెల్ కమ్. ఈ మూవీ షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 25వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానుంది’ అని మేకర్స్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
ఇక ఈ సినిమాకు తమన్ (SS Thaman) మ్యూజిక్ అందిస్తుండగా.. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా గురించి తమన్ మాట్లాడుతూ.. అఖండ మూవీ ఇంటర్వెల్ సీక్వెల్ తోనే మొత్తం డబ్బులు వచ్చేస్తాయంటూ చిత్రంపై సూపర్ హైప్ క్రియేట్ చేశారు.






