YCP సీనియర్ నేత, రాజ్యసభ MP విజయసాయి రెడ్డి(Vijaya Sai Reddy) ఇవాళ తన పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా(Resignation) సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామాపై APCC నేత వైఎస్ షర్మిల(YS Sharmila) స్పందించారు. మాజీ సీఎం, YCP అధినేత జగన్(YS Jagan) కోసం విజయసాయిరెడ్డి చేయని పనులే లేవని అలాంటి వ్యక్తి కూడా ఆయనను వదిలేసి వెళ్లిపోయారంటే వైసీపీలో ఏం జరుగుతుందో ఆలోచించాలని ఆ పార్టీ కార్యకర్తలకు షర్మిల సూచించారు. జగన్ మోహన్ రెడ్డి నాయకుడిగా విశ్వసనీయత(Credibility) కోల్పోయారని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి అంశంపై శనివారం ఆమె విజయవాడ(Vijayawada)లో మీడియాతో మాట్లాడారు.
ఒక్కొక్కరుగా జగన్‌ను వదిలి బయటకి వస్తున్నారు
జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan)కు ఏం చెప్పకుండా విజయసాయి రెడ్డి రాజీనామా చేయరనన్నారు. జగన్ చెప్పాడని తన కుటుంబం, తన పిల్లల మీద ఇష్టం వచ్చినట్లుగా విజయసాయిరెడ్డి మాట్లాడారని గుర్తు చేశారు. YCPని ఆయన వీడారంటే చిన్న విషయం కాదన్నారు. జగన్‌ను వీసారెడ్డి వంటి వారే వదిలి వేస్తున్నారంటే ఆలోచన చేయాలని అన్నారు. ఒక్కొక్కరుగా జగన్‌ను వదిలి బయటకు వస్తున్నారన్నారు. BJPకి, మోదీకి జగన్ దత్త పుత్రుడు అని విమర్శించారు. ఇంతకాలం వీసారెడ్డిని BJP దగ్గర ఉంచే కేసుల విచారణ సాగకుండా జగన్ చేశారని ఆరోపించారు.
అన్ని నిజాలు ఆయన బయట పెట్టాలి
ఇప్పుడు విశ్వాసనీయతను జగన్ కోల్పోయారని విమర్శలు చేశారు. విజయసాయి రెడ్డి గతంలో ఎన్నో అబద్ధాలు(Lies) చెప్పారన్నారు. ఇప్పడైనా అన్ని నిజాలు ఆయన బయట పెట్టాలని చెప్పారు. మాజీ మంత్రి వివేకా కేసు(Ex Minister Viveka’s case)లో కూడా జగన్ చెప్పమన్న విధంగా అబద్ధాలుచెప్పారన్నారు. వీసా రెడ్డి అన్నీ నిజాలు చెబితే.. ప్రజలు ఇప్పుడైనా హర్షిస్తారని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. వైసీపీకి మరికొంత మంది రాజీనామాలు చేసి వెళ్తారని షర్మిల(Sharmila) అన్నారు. కాగా షర్మిల ఇంకేం మాట్లాడారో కింది వీడియోలో వినేయండి.






