చెన్నై(Chennai) వేదికగా ఇంగ్లండ్(England)తో ఉత్కంఠగా జరిగిన రెండో T20లో భారత్(Team India) విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 166 పరుగులను 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (72) సూపర్ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 12, సూర్య కుమార్ 12, సుందర్ 26 రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. చివరకు క్రీజులో ఉండి టీమ్ఇండియాను గెలిపించిన తిలక్ వర్మ(Tilak Varma)కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ దక్కింది. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్ 3, ఆర్చర్, వుడ్, రషీద్, ఓవర్టన్, లివింగ్ స్టోన్ తలో వికెట్ పడగొట్టారు.
78కే 5 వికెట్లు అయినా 165 రన్స్
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్(England)కు ఓపెనర్లు ఈ మ్యాచులోనూ నిరాశపర్చారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ ఒకానొక దశలో 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కానీ కెప్టెన్ బట్లర్ (45), స్మిత్ 22, కార్స్ 31 రన్స్ చేయడంతో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అక్షర్, వరుణ్ చెరో రెండు వికెట్లు తీయగా, అర్షదీప్, పాండ్య, సుందర్, అభిషేక్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యం సాధించింది. ఇక మూడో T20 జనవరి 28న రాజ్కోట్(Rajkot) వేదికగా జరగనుంది.
#INDvsENG || 2nd T20I
🇮🇳India Beat England by 2 Wickets
𝐁𝐫𝐢𝐞𝐟 𝐒𝐜𝐨𝐫𝐞:
ENG 165/9 (20)
IND 166/8 (19.2)📍MA Chidambaram Stadium, Chennai#ENGvsIND | #Cricket | #T20I pic.twitter.com/iADg6cNUZO
— Right choice (@Bipulkumar88088) January 25, 2025






