‘RC16’ లేటెస్ట్ అప్డేట్.. ఆ స్టార్స్​తో రామ్‌ చరణ్‌ షూటింగ్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్​ ఛేంజర్ (Game Changer)’ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. జనవరి 10వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాలో అప్పన్న పాత్రలో చెర్రీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా.. మిక్స్​డ్ టాక్​తో సరిపెట్టుకుంది. డ్యూయెల్​ రోల్​లో చెర్రీ తన నటనతో మెప్పించినా.. ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది.

ఆర్‌సీ 16 నయా షెడ్యూల్

ఇక రామ్ చరణ్ (Ram Charan) తన తదుపరి సినిమాపై ఫోకస్ చేస్తున్నారు. ‘ఆర్‌సీ 16 (RC16)’ అనే వర్కింగ్ టైటిల్​తో రానున్న ఈ సినిమాను ‘ఉప్పెన’ ఫేమ్​ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్​ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్​ ఈనెల 29వ తేదీ నుంచి హైదరాబాద్ లో జరగనుంది.

పెద్ది టైటిల్తో ఆర్‌సీ 16

రాత్రి వేళలో సాగే ఈ షెడ్యూల్‌లో చెర్రీతో పాటు మరికొందరు తారలు పాల్గొననున్నారు. కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో షూట్ చేయనున్నారట. ఈ షెడ్యూల్ కోసం మేకర్స్ ఓ స్పెషల్ సెట్ ను డిజైన్ చేశారట. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉండనున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్ర బ్యాక్​డ్రాప్​లో ఈ మూవీ రానున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా కోసం ‘పెద్ది (Peddi Movie)’ అనే పేరును ఫిక్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

జాన్వీతో చెర్రీ

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటించనుంది. జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.​ ఏఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలతో కలిసి వెంకట సతీశ్‌ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *