తమిళ్ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ లో ‘జవాన్ (Jawan)’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కావడమే గాక రికార్డు బ్రేక్ కలెక్షన్లు రాబట్టింది. ఒక్కసారిగా బీ టౌన్ మొత్తం అట్లీ గురించి మాట్లాడుకునేలా చేసింది. ఇక షారుక్ తోనే అట్లీ తన నెక్స్ట్ ప్రాజెక్టు చేయాలని భావించారు. కానీ అది కుదరలేదు. ఎట్టకేలకు అట్లీ తన నెక్స్ట్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
స్టార్ హీరోలతో అట్లీ సినిమా
అయితే అట్లీ(Atlee) ఇప్పుడు మల్టీస్టారర్ మూవీపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. ఇద్దరు సూపర్ స్టార్లతో తన నెక్స్ట్ సినిమాను తెరకెక్కించనున్నాడట. వాళ్లెవరో కాదు కోలీవుడ్ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ (Rajinikanth).. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan). ఈ ఇద్దరు స్టార్లతో అట్లీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కించనున్నాడట. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ఈ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ అవ్వడం ఖాయం.
అప్పుడే అట్లీ సినిమా
అట్లీ తెరకెక్కించిన తేరీ సినిమాను బాలీవుడ్ లోకి ‘బేబీ జాన్ (Baby John)’ పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అట్లీ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ చిత్రం భారీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక రజినీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చేస్తున్నారు. ఆ తర్వాత నెల్సన్ తో జైలర్-2 (Jailer-2) చేస్తారు. మరోవైపు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం మురుగదాస్ తో సికందర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఇద్దరు తమ కమిట్మెంట్స్ పూర్తయ్యాకే అట్లీతో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారట.






