Tankbund Boat Fire: హుస్సేన్‌సాగర్ బోట్ ఫైర్ ఘటన.. యువకుడి మృతి

హైదరాబాద్(Hyderabad) హుస్సేన్ సాగర్‌‌లో ఆదివారం (జనవరి 26) రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటన(Fire incident)లో ఒకరు మృతిచెందారు. పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో BJP నిర్వహించిన జరిగిన ‘భారత మాతకు మహా హారతి’ కార్యక్రమంలో పడవలో బాణసంచా పేలిన(Fireworks exploded) సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గణపతి(Ganapati) సికింద్రాబాద్‌లోని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. గణపతి పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు.

ఇంకా దొరకని అజయ్ ఆచూకీ

మరోవైపు ఈ ఘటన జరిగి రెండు రోజులవుతున్నా అదృశ్యమైన అజయ్(AJAY) ఆచూకీ లభించలేదు. గల్లంతైన యువకుడి కోసం ఆచూకీ హుస్సేన్ సాగర్‌(Hussain Sagar)లో జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రమాదంలో నాగారానికి చెందిన అజయ్ అదృశ్యమైనట్లు కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హుస్సేన్ సాగర్‌లో గాలించి అజయ్(21) ఆచూకీ తెలపాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అగ్నిప్రమాదంలో అజయ్ అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు లేక్ వ్యూ PSలో ఫిర్యాదు చేశారు. ట్యాంక్ బండ్(Tank bund)లో మునిగిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో చింతల కృష్ణ, సాయి చంద్, సునీల్, ప్రవీణ్ సహా 8 మందికి కాలిన గాయాలు కాగా, వారిని యశోద, గాంధీ, సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపుగా అంతా హాస్పిటల్స్ నుంచి డిశ్ఛార్జ్ కాగా, గణపతి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *