ప్రస్తుత టెక్ యుగంలో సమాజంలో మానవత్వం రోజురోజుకూ కనుమరుగవుతోంది. స్మార్ట్ ఫోన్(Smart Phone) చేతిలో ఉంటే ప్రపంచం ఏమైనా పట్టించుకోని రోజులు వచ్చాయి. ముఖ్యంగా ఎవరు చూసిన ఇన్‌స్టా, యూట్యూబ్, టిక్ టాక్ వంటివాటిల్లో వచ్చే రీల్స్(Reels) పిచ్చిలో పడిపోతున్నారు. దీంతో అవి చేసే క్రమంలో కొందరు, చూస్తూ కొందరూ ప్రాణాలు కోల్పోతున్నారు. మనం ఏదైన అనారోగ్యంతో ఆస్పత్రుల్లో ఉంటే ఆ దేవుడి కంటే ముందు ప్రార్థించేది డాక్టర్ల(Doctors)నే. అలాంటి డాక్టర్లు సరైన సమయానికి స్పందించకుంటే.. తమకేం పట్టనట్టనట్లు వ్యవహరిస్తే.. ఎలా ఉంటుంది. ప్రాణాలు కోల్పోవడం తప్పనిసరి.. సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఇంతకీ ఏమైందంటే..
ఎంత బతిమాలినా పట్టించుకోలేదు..
ఉత్తరప్రదేశ్(UP)లోని మైన్‌పురి(Mainpuri) జిల్లాలోని మహారాజా తేజ్‌సింగ్ ఆసుపత్రి(Maharaja Tej Singh Hospital)కి ప్రవేశ్ కుమారి (60) ఛాతీలో నొప్పి రావడంతో ఆమె కుమారుడు గురుశరణ్తో వచ్చింది. ఆమెకు వైద్యం అందించాలని అతడు పదేపదే కోరినా డాక్టర్ ఆదర్శ్ సెంగార్(Dr. Adarsh Sengar) తనకేం పట్టనట్లు ఫోన్లో రీల్స్ చూస్తూ కూర్చున్నాడు. పైగా నర్సింగ్ సిబ్బందికి ఆమెకు వైద్యం అందించాలని సూచించాడు. ఎంతకీ ఆమెకు నొప్పి తగ్గలేదు.. అయినా ఆ డాక్టర్ ఆమెను పట్టించుకోకుండా రీల్స్ చూస్తూనే ఉన్నాడు. అదే క్రమంలో ఆ మహిళ నొప్పి ఎక్కువై గుండెపోటు(heart attack)తో మరణించింది. ఈ తతంగమంతా సీసీటీవీలో రికార్డైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆ డాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ మదన్ లాల్ అక్కడికి చేరుకొని CCTV ఫుటేజీని పరిశీలించారు. దీనిపై వైద్యుడి తీరు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏదేమైనా ఇలాంటి ఘటనలు జరగడం దారుణం. ప్రాణాలు కాపాల్సిన వైద్యులే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కరెక్టు కాదని కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. డాక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.






