టీమ్ఇండియా(Team India) యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) సుడిగాలి ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్(England)తో టీ20 సిరీస్‌ను సూర్య 4-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే ముంబై వేదికగా జరిగిన చివరి మ్యాచులో పించ్ హిట్టర్ అభిషేక్ వర్మ బ్యాటింగ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(England captain Jos Buttler) సైతం అభిని పొగడకుండా ఉండాలేకపోయాడంటేనే అర్థం చేసుకోవచ్చు. అభిషేక్ ప్రతాపం మ్యాచులో ఏ రేంజ్‌లో ఉందో.. చివరి T20లో 135 పరుగులతో చెలరేగిన శర్మపై బట్లర్ ప్రశంసలు కురిపించాడు. తాను ఇప్పటి వరకు ఎంతో క్రికెట్ చూశానని, అయితే అభిషేక్ హిట్టింగ్ తాను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్(Best Innings) అని వెల్లడించారు. హోం సిరీస్‌లలో భారత్ అద్భుతమైన జట్టు అని చెప్పారు. సిరీస్ కోల్పోవడం బాధగా ఉందన్నారు. వన్డే(ODI)ల్లో పుంజుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
బ్యాటింగ్‌తో మోతెక్కించాడు.. బౌలింగ్‌తో తిప్పేశాడు
కాగా ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచులో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సుడిగాలి సెంచరీ సాయంతో టీమ్ఇండియా 247 భారీ స్కోరు నమోదు చేసింది. భారత ఇన్నింగ్స్ లో అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లు(England bowlers) అల్లాడిపోయారు. ఎడాపెడా బౌండరీలతో మోతెక్కించిన అభి.. కేవలం 37 బంతుల్లోనే 100 పరుగులు చేసి T20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ(Second fastest century) నమోదు చేశాడు. మొత్తంగా 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 7 ఫోర్లు, 13 భారీ సిక్సులు ఉన్నాయి. అంతేకాదు బౌలింగ్‌లోనూ ఈ లెఫ్టార్మర్ ఒక ఓవర్ వేసి రెండు వికెట్లు పడగొట్టాడు.
ఈనెల 6 నుంచి వన్డేల సమరం
కాగా ఈ మ్యాచులో 248 పరుగుల ఛేదనలో ఇంగ్లంగ్ 97 పరుగులకే కుప్పకూలి 150 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఇరగదీసిన అభిషేక్ వర్మకు Man of the Match అవార్డు దక్కగా.. సిరస్ మొత్తం అద్భుతంగా బౌలింగ్ చేసి 13 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి(Varun Chakravartyకి Man of the Series అవార్డు లభించింది. కాగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఈనెల 6నుంచి ప్రారంభం కానుంది. తొలి వన్డే 6న, రెండో వన్డే 9న, మూడో వన్డే 12న జరగనుంది.
🌟 A Proud Moment for Punjab Cricket Association 🌟
History has been made! Abhishek Sharma, a shining star from Punjab Cricket Association, has etched his name in the record books with a sensational 100 off just 37 balls in the final T20I against England. His fearless approach,… pic.twitter.com/5lwB8edyCj
— Punjab Cricket Association (@pcacricket) February 2, 2025






