టాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేశ్ ఇటీవలే ‘బేబీ జాన్ (Baby John)’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ భామ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఎంట్రీ ఇస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రూపొందిస్తున్న ప్రాజెక్టులో కీర్తి భాగమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ అక్క (AKKA). బాలీవుడ్ నటి రాధికా ఆప్టే ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది.
పవర్ ఫుల్ పాత్రలో కీర్తి
యష్ రాజ్ ఫిలిమ్స్, నెట్‌ఫ్లిక్స్ (Netflix) సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి నెట్‌ఫ్లిక్స్ తాజాగా ఫస్ట్ లుక్ టీజర్‌ను రిలీజ్ చేసింది. ఈ టీజర్ లో కీర్తి (Keerthy Suresh) చీరకట్టులో అందంగా కనిపించడమే కాకుండా.. పవర్ ఫుల్ లేడీ డాన్ వైబ్స్ ఇచ్చింది. ‘పెర్నూరుకు చెందిన ఒక అమ్మాయి అక్కలపై ప్రతీకారం తీర్చుకునేందుకు వస్తోంది’ అంటూ నెట్ ఫ్లిక్స్ ఈ టీజర్ కు ట్యాగ్ లైన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ టీజర్ బాగా వైరల్ అవుతోంది.
కీర్తి లుక్ అదుర్స్
ఇక ఈ టీజర్ లో కీర్తి లుక్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటివరకు కీర్తిని చూడని అవతార్ లో చూస్తున్నామని అంటున్నారు. ఈ పాత్రతో మహానటి భామ తనలోని మరో కోణాన్ని చూపించబోతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. కీర్తి (Keerthy Suresh AKKA) నట విశ్వరూపాన్ని ఈ సిరీస్ లో చూడబోతున్నామంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి కీర్తి సురేశ్ అక్క సిరీస్ గురించి ఇప్పుడు నెట్టింట బాగా చర్చ జరుగుతోంది.






