‘అల వైకుంఠపురములో’ త‌మిళ సినిమా.. నోరుజారిన బుట్టబొమ్మ

త్రివిక్రమ్-పూజా హెగ్డే (Pooja Hegde).. ఈ సూపర్ కాంబోలో సినిమా వస్తే కచ్చితంగా హిట్ కొడుతుందనే సెంటిమెంట్ ఉంది. ఈ కాంబోలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక అల వైకుంఠపురములో సినిమాతో పూజను బుట్టబొమ్మ అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలవడం మొదలుపెట్టారు.

అది తమిళ్ సినిమా

అయితే తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఈ సినిమా గురించి మాట్లాడుతూ పూజా హెగ్డే నోరు జారింది. ‘అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo)’ సినిమా తమిళ్ మూవీ అంటూ తప్పులో అడుగేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి తెలుగు ప్రేక్షకులు పూజాపై మండిపడుతున్నారు. ‘మీ కెరీర్ లో సూపర్ హిట్ ఇచ్చిన చిత్రం తెలుగో తమిళో కూడా తెలియదా?’ అంటూ ఫైర్ అవుతున్నారు.

దేవా ప్రమోషన్స్ లో నోరు జారిన బుట్టబొమ్మ

పూజా హెగ్డే తాజాగా షాహిద్ క‌పూర్ (Shahid Kapoor) తో కలిసి ‘దేవా (Deva)’ అనే హిందీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు రోష‌న్ ఆండ్రోస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌(Deva Movie Promotions)లో భాగంగా పూజా మాట్లాడుతూ.. అల వైకుంఠపురములో త‌మిళ సినిమా అని ఇది పాన్ ఇండియా లెవ‌ల్‌లో రీచ్ అయ్యింద‌ని చెప్పుకొచ్చింది.

అది కూడా తెలియదా పూజ?

ఈ వీడియో వైరల్ కావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు మూవీ లవర్స్ పూజపై ఫైర్ అవుతున్నారు. నీకు సూప‌ర్ హిట్ ఇచ్చిన సినిమా ఏ భాష అనేది తెలియకుండా ఎలా మాట్లాడుతున్నావు అంటూ విమర్శిస్తున్నారు.  ఉన్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా దాదాపు రూ.250 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ు రాబ‌ట్టి సూప‌ర్ హిట్‌గా నిలిచింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *