RX100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ఫీమేల్ లీడ్ రోల్లో చేసిన మూవీ ‘మంగళవారం (Mangalavaram)’. 2003లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన మూవీల్లో ఒకటిగా నిలిచింది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్(psychological mystery thriller)గా ఈ మూవీని డైరెక్టర్ అజయ్ భూపతి(Director Ajay Bhupathi) తెరకెక్కించాడు.
నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమా మేకర్స్ నుంచి మరో సూపర్ అప్డేట్ వచ్చింది. ఉద్వేగంతో కూడిన కథ, సస్పెన్స్, ట్విస్టులు, నేపథ్య సంగీతం, విజువల్స్ ఇప్పటికీ ఈ మూవీకి హైలైట్‌గా నిలిచాయి. తాజగా ఈ మూవీ సీక్వెల్(Sequel)పై డైరెక్టర్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
Mangalavaram 2 script work is done expect the movie this year , new face new reign
Part 1 cinematic experience wise thope 👌 but story anedhi emundhi part 2 laagadaniki @DirAjayBhupathi pic.twitter.com/TqyNQGO9e8
— RB🐎 (@RBLOGER_3) February 5, 2025
వీలైనంత త్వరలోనే షూటింగ్..?
మంగళవారం సినిమా తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి(Ajay Bhupathi) మరో సినిమా చేయలేదు. లేటెస్ట్గా మంగళవారం-2(Mangalavaram-2) గురించి ఆసక్తికర కబుర్లు షేర్ చేసుకున్నాడు అజయ్ భూపతి. మంగళవారం సీక్వెల్‌కు రంగం సిద్ధం చేసినట్లు తెలిపాడు. వీలైనంత త్వరలోనే మూవీని పట్టాలెక్కించనున్నారట.
అయితే ఈ సినిమా ‘మంగళవారం’ సినిమాకి సీక్వెల్ కాదట ప్రీక్వెల్ అని తెలుస్తోంది. అయితే ఈ మూవీలో పాయల్ రాజ్‌పుత్ స్థానంలో మరో కొత్త హీరోయిన్ నటించొచ్చని టాక్ నడుస్తోంది. ఈ సినిమా బజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఓ బాలీవుడ్(Bollywood) నిర్మాణ సంస్థ కూడా మేకింగ్‌లో భాగస్వామ్యం అయినట్లు సమాచారం. దీంతో వీలైనంత త్వరలోనే అభిమానులకు మరో సస్పెన్స్ థ్రిల్లర్ చూసే అవకాశం దక్కనుంది.






