
బంగారం ధరలు(Gold Rates) వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. బుధవారం (ఫిబ్రవరి 5) ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన పుత్తడి ధరలు కొనుగోలుదారులను భయపెట్టాయి. అంతర్జాతీయంగానూ పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఒక ఔన్స్ బంగారం(Aunce of gold) ధర 2,890 డాలర్లు పలికింది. దేశీయంగా కూడా బంగారు ఆభరణాలకు పెద్ద ఎత్తున డిమాండ్(Demand) ఏర్పడటం, ప్రస్తుతం మాఘమాసం కావడంతో పెళ్లిళ్ల సీజన్(Marriage Season) ఉన్న నేపథ్యంలో పుత్తడికి డిమాండ్ పెరిగింది. ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి ఒక కారణమని మార్కెట్ నిపుణులు (Market experts) అంటున్నారు. కాగా ఇవాళ (ఫిబ్రవరి 6) బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా..
అదే జరిగితే రూ.లక్ష దాటడం ఖాయం
బంగారం ధర ఏ రోజుకు ఆ రోజు సరికొత్త రికార్డును స్థాపిస్తూ ముందుకు దూసుకు వెళ్తోంది. ఇవాళ 24 క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ.82,640 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,050 పలికింది. ఇదే ట్రెండు కొనసాగినట్లయితే అతి త్వరలోనే తులం బంగారం ధర రూ. 1,00,000 దాటడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు వెండి ధరలు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కిలో వెండి(Silver) ధర రూ. 100 పెరిగి రూ.1,70,100గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. కాగా రూపీ వ్యాల్యూ(Rupee Value) ఒక అమెరికా డాలర్‌కి రూ.87.08గా ఉంది.