టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘తండేల్’ (Thandel). సాయిపల్లవి (Sai Pallavi) కథానాయికగా నటించిన ఈ సినిమా ఈనెల 7వ తేదీన (శుక్రవారం) థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా చైతన్య సతీమణి శోభితా ధూళిపాళ్ల సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్టు షేర్ చేసింది.

థాంక్యూ బుజ్జితల్లి
ఇన్‌స్టా స్టోరీస్‌లో తండేల్ పోస్టర్ షేర్ చేసిన శోభితా(Sobhita Dhulipala) .. సినిమా రిలీజ్‌పై ఆనందం వ్యక్తం చేస్తూ తాను చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పింది. ‘‘ఈ సినిమా షూటింగ్ టైంలో మీరు చాలా ఫోకస్ గా ఉన్నారు. చాలా చాలా పాజిటివ్‌గా ఉండటం నేను చూశాను. ఈ అద్భుతమైన లవ్ స్టోరీని అందరితోపాటు నేను కూడా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ.’’ అని శోభిత తన పోస్టులో పేర్కొంది.

చైతూపై నెటిజన్లు ఫైర్
ఈ పోస్టుపై చైతన్య స్పందిస్తూ.. ‘‘థాంక్యూ బుజ్జితల్లి’’ అని క్యూట్ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ దంపతులిద్దరి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైతూ రిప్లై క్యూట్ గా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. గతంలో సమంతపై ఇలా బహిరంగంగా ఎప్పుడూ ప్రేమను వ్యక్తపరచలేదని మరికొందరు చైతూపై ఫైర్ అవుతున్నారు. నిజమే సమంతే (Samantha) చైతూను ప్రేమించింది కానీ.. చైతన్య సామ్ ను లవ్ చేయలేదు అంటూ ఇంకొందరు కామెంట్స్ పెట్టారు. అరే.. వాళ్లు విడిపోయి వారి వారి లైఫ్ లో ముందుకెళ్తుంటే మీ కామెంట్స్ తో ఎందుకు వెనక్కి లాగుతున్నారంటూ కొందరు అభిమానులు వారికి సపోర్టుగా నిలుస్తున్నారు.






