హాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మార్వెల్ (Marvel) నుంచి మరో కొత్త సినిమా వచ్చేస్తోంది. ఈసారి సరికొత్త సూపర్ హీరోస్ ను ఈ నిర్మాణ సంస్థ ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజా సినిమా ‘థండర్‌బోల్ట్స్ (Thunderbolts)’ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. జేక్ ష్రెయిర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఫ్లోరెన్స్ పగ్, సెబాస్టియన్ స్టాన్, డేవిడ్ హార్బర్, వ్యాట్ రస్సెల్, ఓల్గా కురిలెంకో, పుల్మాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మార్వెల్ నుంచి సరికొత్త సూపర్ హీరోస్
మే 2వ తేదీన ‘థండర్ బోల్ట్స్’ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా తెలుగు ట్రైలర్ (Thunderbolts Telugu Trailer) రిలీజ్ చేశారు. అవెంజర్స్ అమెరికాను విడిచి వెళ్లిన తర్వాత ఆ నగరానికి కొత్త సూపర్ హీరోల అవసరం వస్తుంది. ఈ క్రమంలోనే ఈ నగరాన్ని కాపాడే బాధ్యతను అమెరికన్ రక్షణ విభాగం సెబాస్టియన్ స్టాన్ (వింటర్ సోల్జర్)కి అప్పగిస్తుంది. అప్పుడు వింటర్ సోల్జర్.. థండర్ బోల్ట్స్ అనే ఒక టీమ్‌ను తయారు చేస్తాడు.
థండర్ బోల్ట్స్ టీమ్
మరి వింటర్ తయారు చేసిన ఈ థండర్‌బోల్ట్స్ అమెరికాను ఎవరి నుంచి రక్షిస్తుంది.. ఎలా రక్షిస్తుంది.. అమెరికాను రక్షించేందుకు ఈ టీమ్ చేసే సాహసలేంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఫుల్ ఆన్ యాక్షన్ ప్యాక్డ్గా సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. తెలుగులోనూ భారీ వ్యూస్ సాధిస్తూ థండర్ బోల్ట్స్ దూసుకెళ్తోంది. మరి మీరూ ఈ ట్రైలర్ ను చూసేయండి.






