”I am In Love With The Shape Of You’…, ‘Perfect” వంటి పాటలతో భారతీయ ప్రేక్షకులకు చేరువయ్యాడు బ్రిటీష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరన్ (Ed Sheeran). ఇటీవలే ఇండియా టూర్ లో భాగంగా పలు హిందీ పాటలు కూడా పాడాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్లను కలిశాడు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామని అనుకుంటున్నారా.. అయితే ఇప్పటి వరకు ఇంగ్లీష్ పాటలతోనే అలరించిన ఎడ్.. తాజాగా ఓ కన్సర్ట్ లో తెలుగు పాట పాడాడు.
బ్రిటీష్ సింగర్ నోట తెలుగు పాట
ఎన్టీఆర్ ‘దేవర (Devara)’లో ‘చుట్టమల్లే (Chuttamalle)’ పాట ఎంత వైరలైందో అందరికీ తెలిసిందే. ఆ సాంగ్ విడుదలైన నాటి నుంచి చాలా మంది విదేశీలు ఈ పాటకు స్టెప్పులేశారు. కొందరు విదేశీ సింగర్స్ ఈ పాటకు కవర్ సాంగ్ కూడా చేశారు. తాజాగా ఓ మ్యూజికల్ కన్సర్ట్ లో బ్రిటిష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరన్ చుట్టమల్లే పాటను పాడాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు.
Wow This is Crazyyy Reach 💥💥#Chuttamalle from @edsheeran ❤️🔥❤️🔥@DevaraMovie @anirudhofficial @tarak9999 #Devara pic.twitter.com/RdhDmTvu60
— Tony (@NMeklaNTR) February 9, 2025
ఎడ్.. ఇది చాలా స్పెషల్
బెంగుళూర్‌లోని మ్యూజికల్ కన్సర్ట్ లో ఎడ్ షీరన్ (Ed Sheeran Devara Song) దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్ పాడి ఆడియన్స్‌లో జోష్ నింపారు. ఈ పాట పాడిన సింగర్ శిల్పా రావుతో కలిసి ఎడ్ గొంతు కలిపారు. బ్రిటిష్ సింగర్ నోట తెలుగు పాట రావడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన ఎన్టీఆర్ దీనిపై తాజాగా స్పందిస్తూ.. ‘సంగీతానికి హద్దులు ఉండవు. మీరు ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు. మీ గొంతులో చుట్టమల్లే పాట వినడం నిజంగా ప్రత్యేకం’’ అంటూ ఎడ్ షీరన్ (NTR Thanks Ed Sheeran) కు ధన్యవాదాలు తెలిపారు.
పార్ట్-2 మరింత పవర్ ఫుల్
‘ఆర్ఆర్ఆర్ (RRR)’ వంటి గ్లోబల్ హిట్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఆరేళ్ల తర్వాత ‘దేవర’ సినిమాతో వచ్చాడు. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తో పాటు భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఇందులోని పాటలన్నీ యూట్యూబ్ లో భారీ వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ‘చుట్టమల్లే’ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ (Janhvi Kapoor) నటించింది. ఇక దేవర పార్ట్-2 పార్ట్-1 కంటే పవర్ ఫుల్ గా ఉంది.






