పాస్‌పోర్టు ఆఫీసుకు మాజీ సీఎం కేసీఆర్‌

బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) సికింద్రాబాద్‌ పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తన పాస్‌పోర్టును రెన్యువల్‌ చేయించుకున్నారు. అనంతరం పాస్‌పోర్టు కార్యాలయం నుంచి నేరుగా కేసీఆర్‌ తెలంగాణ భవన్‌ చేరుకున్నారు.

7 నెలల తర్వాత తెలంగాణ భవన్ కు

దాదాపు 7 నెలల విరామం తర్వాత కేసీఆర్‌ తెలంగాణ భవన్ (Telangana Bhavan) కు వెళ్లారు. ఈ సందర్భంగా ఇవాళ జరుగుతున్న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం వేళ భవిష్యత్‌ కార్యాచరణపై ఈ సమావేశంలో నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేయనున్నారు.

ఆ విషయాలపై చర్చ

మరోవైపు పార్టీ ప్లీనరీ, ప్రతినిధుల సభ, పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటుపై ఈ సమావేశంలో కేసీఆర్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుతో పాటు ఇచ్చిన హామీల అమలు కోసం ఒత్తిడి తెచ్చేలా చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలకు ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపైనా ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు సమాచారం.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *