శివరాత్రి స్పెషల్.. సూపర్ ఫన్ గా ‘రాబిన్‌హుడ్‌’ మేకింగ్‌ వీడియో

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithin), మోస్ట్ హాప్పెనింగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాబిన్ హుడ్. వెంకీ కుడుముల (Venky Kudumula) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మార్చి 28వ తేదీన రిలీజ్ కానుంది. నేడు మహాశివరాత్రి సందర్భంగా మేకర్స్ ఈ సినిమా మేకింగ్ (Robinhood Making Video) వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో సూపర్ ఫన్ గా ఉంది.

రాబిన్ హుడ్ మేకింగ్ వీడియో

‘నాకు ఆస్కార్ రావాలి’ అంటూ శ్రీలీల అనగా.. బ్యాక్ గ్రౌండ్ లో పిచ్చోళ్ల గురించి వినడమే గానీ లైవ్ లో ఇదే చూడ్డం అని బ్రహ్మానందం డైలాగ్ రావడం ఈ వీడియోకే హైలైట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా షూటింగులో చిత్రబృందం జాలీగా గడిపినట్లు ఈ వీడియో చూస్తే అర్థమైపోతోంది.  మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.

లైట్స్ కెమెరా అండ్ ఫన్

ఇక ఈ సినిమా సంగతికి వస్తే నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా శ్రీలీల ఫీ మేల్ లీడ్ లో సందడి చేయనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాశ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రబృందం లైట్స్ కెమెరా అండ్ ఫన్ (#LightsCameraAndFun) అనే క్యాప్షన్ తో రాబిన్ హుడ్ మేకింగ్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *