నేచురల్ స్టార్ నాని (Actor Nani) ఇప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కానీ శ్రీకాంత్ ఓదెలతో కలిసి చేసిన దసరా (Dasara) మూవీతో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే గాక బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటింది. కానీ ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇటీవల హిట్-3 (HIT-3) టీజర్ తో నాని తనలోని వైలెంట్ యాంగిల్ చూపించాడు. కానీ తాజాగా శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న మరో సినిమాలో మాత్రం ఊరమాస్, వైలెంట్ కే వెలైంట్ పాత్రలో రచ్చ లేపాడు.
మోస్ట్ వైలెంట్ పాత్రలో నాని
శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela), నాని కాంబోలో ది ప్యారడైజ్ (The Paradise) అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ తెలియజేసేలా రా స్టేట్మెంట్ అంటూ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ లో నాని అవతారం చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. నానిని ఇంత వైలెంట్ యాంగిల్ లో ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. ఊరమాస్ పాత్రలో.. చాలా వైలెంట్ అవతార్ లో నాని ఈ గ్లింప్స్ లో కనిపించాడు. ఇక నాని పాత్రను ఎలివేట్ చేస్తూ ఈ సినిమాలో హీరో తల్లి చెప్పిన ఇంట్రో ఈ గ్లింప్స్ కే హైలైట్ గా నిలిచింది.
నా కొడుకు నాయకుడైన కథ
‘కాకుల కథ.. కాకుల్ని ఒక్కటి చేసిన ఓ ల.. జా కొడుకు కథ.. నా కొడుకు నాయకుడైన కథ’ అంటూ హీరో తల్లి హీరోను పరిచయం చేస్తూ సాగిన గ్లింప్స్ (The Paradise Glimpse) ఇప్పుడు నెట్టింట రచ్చ లేపుతోంది. ఈ సినిమాలో నాని చాలా రస్టిక్ పాత్రలో కనిపించనున్నట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. దసరా సినిమాలోనే నాని తనలోని వయోలెన్స్ ను చూపించాడు. హిట్-3 టీజర్ తో అంతకుమించి తన వైలెంట్ అవతార్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇక ది ప్యారడైజ్ సినిమా గ్లింప్స్ తో నాని ప్రేక్షకులకు ఎప్పుడూ చూపించని, అసలు ఎవరూ ఊహించని పర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. గ్లింప్స్ చూస్తుంటేనే ఈ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ అయింది.






