ఒకప్పుడు మాస్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్.. దిల్, ఆది, ఠాగూర్, చెన్నకేశవరెడ్డి, అదుర్స్ కృష్ణ, అల్లుడు శీను వంటి బ్లాక్బస్టర్ సినిమాలు అందించి ట్రెండ్ సెట్ చేశాడు. కానీ కొంత కాలంగా ఆయన పేరే వినిపించడం లేదు. తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ హిట్ మూవీలను అందించిన ఆ స్టార్ డైరెక్టరే వివి వినాయక్(VV Vinayak). కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం ఆయన హెల్త్(Health) బాగోలేదని, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని గత రెండ్రోజులుగా సోషల్ మీడియా(SM)లో ఓ న్యూస్ తెగ వైరలవుతోంది. దీంతో ఆయన పీఆర్ టీమ్ తాజాగా స్పందించింది.
‘‘ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం(Health)పై వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధం. సోషల్ మీడియాలో వ్యూస్(Views) కోసం తప్పుడు వార్తలు సృష్టించొద్దు. వాస్తవాలు తెలుసుకొని రాయడం మంచింది. తప్పుడు రూమర్లను ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని క్లారిటీ ఇచ్చారు. దీంతో వివి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సరైన సక్సెస్ లేకపోవడంతోనే..
కాగా టాలీవుడ్(Tollywood)లో మాస్ డైరెక్టర్గా వివి వినాయక్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆయన దర్శకత్వంలో ఈ సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్ సొంతం చేసుకున్నాయి. అయితే ఇటీవల కాలంలో సరైన సక్సెస్ లేక ఆయన వెనుకబడిపోయారు. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas)తో ‘ఛత్రపతి’ హిందీ రీమేక్(‘Chhatrapati’ Hindi remake)తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అయితే ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ఆయనకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినట్లు వార్తలు వచ్చాయి.






