బంగారం ధరలు(Gold Rates) మళ్లీ షాకిచ్చాయి. గత మూడు రోజులుగా కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్న ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తీరు కొనసాగితే పసిడి తులం రూ.లక్ష మార్కును చేరే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు(Market analysts) అభిప్రాయపడుతున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలతోపాటు ఢిల్లీ, ముంబైలోనూ పుత్తడి ధరలు ఆకాశాన్నంటాయి. అటు వెండి సైతం బంగారానికి ఏమాత్రం తీసిపోకుండా పెరుగుతూనే ఉంది. ఇవాళ (మార్చి 4) తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి(Silver Price) ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
☛ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.700 పెరిగి రూ.80,100గా కొనసాగుతోంది
☛ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.760 పెరిగి రూ.87,380 వద్ద ట్రేడ్ అవుతోంది.
☛ ఇక కేజీ వెండిపై ఏకంగా రూ.2000 పెరిగి ప్రస్తుతం రూ.1,07,000గా నమోదైంది.
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ఇక రూపీ వ్యాల్యూ(Rupee Value) కూడా రోజురోజుకూ పతనమవుతోంది. ఇవాళ ఒక అమెరికా డాలర్‌కు రూ.87.47గా ఉంది. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు(Stock Markets) ఇవాళ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
)
నిఫ్టీ 22,044 (-80), సెన్సెక్స్ 72,890 (-210) వద్ద చలిస్తున్నాయి. మెక్సికో, కెనడాపై 25%, చైనా(Chaina)పై 20% టారిఫ్స్ అమల్లోకి రావడం ఇన్వెస్టర్ల(Investers)లో నెగటివ్ సెంటిమెంటుకు దారితీసింది.






