సెలబ్రిటీ జంటల మధ్య ప్రేమ, బ్రేకప్, పెళ్లి, విడాకులు ఈమధ్య కామన్ అయిపోయాయి. మనస్పర్థలు, అనుమానాలు, అనైతిక సంబంధాలతో కొందరు విడాకులు తీసుకుంటే.. మరికొందరు మాత్రం సిల్లీ కారణాలతో విడిపోతుంటారు. తాజాగా ఓ నటుడు కూడా చాలా విచిత్రమైన కారణంతో విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచాడు. మరి ఆ నటుడు ఎవరు.. ఇంతకీ ఆ సిల్లీ రీజన్ ఏంటి తెలుసుకుందామా..?
బాలీవుడ్ నటుడు అరుణోదయ్ సింగ్ (Arunoday Singh ) ఓ విచిత్రమైన కారణంతో తన భార్య లీ ఎల్టన్ కు విడాకులు ఇచ్చాడు. కెనడియన్ బ్యూటీ లీ ఎల్టన్‌ను ప్రేమించిన అరుణోదయ్ పెద్దల అంగీకారంతో 2016 డిసెంబర్ 13వ తేదీన ఆమెను ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే వారి సంతోషం మాత్రం ఎక్కువ కాలం నిలవలేదు. పెంపుడు కుక్కలు అంటే ఎంతో ఇష్టపడే అరుణోదయ్ తన ఇంట్లో చాలా శునకాలను పెంచుకునేవాడు. అయితే వాటి అరుపులు తన భార్య ఎల్టన్ కు చిరాకు తెప్పించాయి.
ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవలు జరిగినట్లు సమాచారం. చివరకు ఆ గొడవలు ఇద్దరు విడిపోయే వరకు దారి తీశాయి. ఇలా గొడవ పడటం కంటే విడిపోవడమే మంచిదని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. చివరకు విడాకులు తీసుకుని ఎవరి దారిలో వారు వెళ్లిపోయారట. అలా పెంపుడు కుక్కలపై అరుణోదయ్ కు ఉన్న ప్రేమ వల్ల ఈ జంట విడిపోయిందట.
ఇక అరుణోదయ్ సింగ్ సినిమాల సంగతికి వస్తే 2009లో ‘సికిందర్’ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘యే సాలి జిందగీ’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న అరుణోదయ్.. ‘జిస్మ్ 2’, ‘మై తేరా హీరో’ , ‘మిస్టర్. ఎక్స్’, ‘మోహెంజో దారో’, ‘బ్లాక్‌మెయిల్’ వంటి సినిమాల్లో కనిపించాడు. త్వరలో ‘శ్రీమాన్’ సినిమాలో కనిపించనున్నాడు.






