టాలీవుడ్ సింగర్ కల్పన (Kalpana) మంగళవారం రోజున ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలోనే పోలీసులు కల్పన స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు తెలిసింది. అయితే తన పెద్ద కుమార్తెను కేరళ నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడే చదువుకోమని కోరగా.. ఆమె నిరాకరించడం వల్లే మనస్తాపానికి గురై కల్పన ఆత్మహత్యాయత్నం చేసినట్లు వాంగ్మూలంలో చెప్పినట్లు సమాచారం.
అది ఆత్మహత్యాయత్నం కాదు
అయితే ఈ వార్తలను కల్పన పెద్ద కుమార్తె ఖండించారు. తన తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకోవాలని అనుకోలేదని తెలిపారు. తన తల్లికి నిద్రమాత్రలు వేసుకుని పడుకునే అలవాటు ఉందని, ఈ క్రమంలోనే ఆ మాత్రలు ఎక్కువగా వేసుకోవడం వల్ల ఓవర్ డోస్ అయ్యి తను అపస్మారక స్థితిలోకి వెళ్లిందని కల్పన కుమార్తె వెల్లడించారు. తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని, తన తల్లి త్వరగా కోలుకుని అందరి ముందుకు వస్తారని చెప్పారు.
మా అమ్మ సూసైడ్ చేసుకోవాలి అనుకోలేదు: కల్పన కూతురు
ఓవర్ డోస్ వల్లే అస్వస్థతకు గురయ్యారు
మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు
తొందర్లోనే మళ్లీ ఎప్పటిలాగా మీ ముందుకు వస్తారు
– కల్పన కూతురు https://t.co/4sFOIR0Xb9 pic.twitter.com/rwZkO7ZHNb
— BIG TV Breaking News (@bigtvtelugu) March 5, 2025






