స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ రేటు ఎంతంటే?

గత కొద్ది రోజులుగా బంగారం ధరల(Gold Price)కు రెక్కలొచ్చి ఆకాశాన్నంటుతున్నాయి. 10 గ్రాముల పసిడి ధర దాదాపు రూ.90వేలకు చేరింది. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యత చేపట్టడం, ఆ తర్వాత టారిఫ్ పెంపు ప్రకటనలతో పుత్తడి రేట్లు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. అయితే చాలా రోజుల తర్వాత పసిడి ప్రియులకు కాస్త ఊరటనిచ్చే వార్త ఏంటంటే.. ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు (Gold Price Today) గురువారంతో పోలిస్తే శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 20 డాలర్ల మేర తగ్గి ప్రస్తుతం 2904 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సిల్వర్ రేటు ఔన్సుకు 32.55 డాలర్ల వద్ద ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.490 తగ్గి రూ.87, 490 వద్దకు చేరింది.  22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.450 తగ్గి రూ. 80,200 వద్ద పలుకుతోంది.

షాక్ ఇచ్చిన వెండి ధరలు

మరోవైపు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర తగ్గి మహిళలకు కాస్త ఊరట కలిగించినా వెండి ధరలు (Silver Price Today) మాత్రం షాక్ ఇస్తున్నాయి. గురువారం రోజున  స్థిరంగా ఉన్న వెండి ధరలు ఇవాళ కాస్త పెరిగాయి.  కిలో వెండిపై రూ.1000 మేర పెరిగి.. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో  రూ.1,08,000 వద్దకు చేరింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *