ISS: అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన వ్యోమగామి ఎవరంటే?

సునీతా విలియమ్స్(Sunita Williams) 9 నెలలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో గడిపారు. భూమికి దాదాపు 4,000KM ఎత్తులో ఉన్న ఆమె రోజులు, అనుభవాలు అసాధారణమైనవి. కానీ ఇప్పుడు, ఎన్నో అనుభవాలతో, కొత్త జ్ఞాపకాలతో సునీతా విలియమ్స్ తిరిగి వచ్చారు. ఈ రోజు తెల్లవారుజామున 3:27 గంటలకు ఆమె అమెరికా నేలపై అడుగు పెట్టారు. ఇది కేవలం ఓ ప్రయాణం కాదు.. ఇది ఒక గొప్ప అనుభవానికి ముగింపని కోట్లాది మంది భావిస్తున్నారు.

అతను 5 అంతరిక్ష ప్రయాణాలు చేశాడు

కానీ ఇదే సమయంలో మనలో చాలా మందికి ఓ ప్రశ్న కలుగుతుంది. అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన వ్యోమగామి(Astronaut) ఎవరు? భూమి మీద ఉన్న మనం, ఒక రోజైనా అంతరిక్షంలో గడపగలమా? అనే సందేహం ఉంటుంది. అయితే అక్కడి వాతావరణం(Weather), జీవన పరిస్థితులు, శరీరంపై ప్రభావాలు అన్నీ భిన్నంగా ఉంటాయి. కానీ ఓ మనిషి మాత్రం 879 రోజులు అంతరిక్షంలో గడిపాడు. ఆయనే గెన్నాడీ పడల్కా(Gennady Padalka). ఆయన రష్యా వ్యోమగామి. ఆయన తన జీవితంలో మొత్తం 5 అంతరిక్ష ప్రయాణాలు చేశారు.

Record-breaking Russian cosmonaut returns to Earth | Euronews

తొలి అడుగు అక్కడే..

అంతేకాదు అంతరిక్షంలో మానవుల భవిష్యత్తు(Human Future) ఎలా ఉండబోతుందో చూపించింది. గెన్నాడీ 1958లో రష్యా(Russia)లోని క్రాస్నోడార్ అనే చిన్న పట్టణంలో జన్మించాడు. చిన్నతనంలోనే ఆకాశాన్ని చూస్తూ కలలు కన్నాడు. పైలట్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆయన తొలి అడుగులు సోవియట్ వైమానిక దళంలో మొదలయ్యాయి. విమానాలు నడిపే అనుభవంతో, ఆయన 1989లో రష్యన్ కాస్మోనాట్(Russian cosmonaut) జట్టులో చోటు దక్కించుకున్నారు.

Suited for Space: Cosmonaut Gennady Padalka Sets Record for Days in Orbit

Related Posts

Shubhanshu Shukla-PM Modi: స్పేస్‌లో ఉన్న శుభాంశు శుక్లాతో మాట్లాడిన ప్రధాని మోదీ

భారత అంతరిక్ష రంగం(Indian space sector)లో ఒక కొత్త అధ్యాయం ఆరంభమైంది. భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా(IAF Group Captain Shubhanshu Shukla) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి అడుగుపెట్టిన తొలి ఇండియన్‌గా చరిత్ర సృష్టించారు. ఈ హిస్టారికల్…

నింగిలోకి ఫాల్కన్-9 రాకెట్.. ఈనెల 19న భూమి మీదకు సునీతా విలియమ్స్!

దాదాపు 9 నెలలుగా అంతరిక్షం(Space)లో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams), బుచ్ విల్‌మోర్(Butch Wilmore) త్వరలోనే తిరిగి భూమ్మీద అడుగుపెట్టనున్నారు. వీరిని తీసుకొచ్చేందుకు నలుగురు వ్యోమగాములతో కూడిన Falcon-9 Rocket ఇవాళ (మార్చి 16) నింగిలోకి దూసుకెళ్లింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *