SSMB29 సెట్లో జక్కన్న కొత్త రూల్.. నటీనటులకు మైండ్ బ్లాక్

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో ఎస్ఎస్ రాజమౌళి  ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఒడిశాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ లో మహేశ్ బాబు, ప్రియాంకా చోప్రా (Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్ ల మధ్య సన్నివేశాలను జక్కన్న తెరకెక్కిస్తున్నారు. అయితే ఒడిశా మూవీ సెట్ నుంచి ఇప్పటికే కొన్ని ఫొటోలు, వీడియోలు లీక్ అయ్యాయి.

సెట్ లో రాజమౌళి ఆంక్షలు

SSMB29 నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్న జక్కన్న(SS Rajamouli).. ఈ సినిమా ఫొటోలు లీక్ కావడంతో అలర్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే షూటింగ్ సెట్ లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాడట. ఇప్పటికే టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన రాజమౌళి సినిమా సీన్లు లీక్ (SSMB29 Photos Leak) కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నాడట. అయితే ఈ సినిమా షూటింగులో పాల్గొంటున్న నటీనటులు, సిబ్బంది నుంచి మొబైల్ ఫోన్లు తీసుకున్న తర్వాతే వారిని సెట్లోకి అనుమతిస్తున్నాడట.

నయా రూల్ తో మైండ్ బ్లాక్

అంతేకాదు తాజాగా జక్కన్న సెట్లో మరో కొత్త రూల్ పెట్టాడట. ఈ రూల్ ప్రకారం నటీనటుల వ్యక్తిగత స్టాఫ్ లో ఒకరిద్దరిని మించి సెట్లోకి అనుమతించడం లేదట. మ‌హేష్ బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ ముగ్గురూ ఆయా ఇండస్ట్రీల్లో స్టార్ నటులు. వారి వ్యక్తిగత స్టాఫ్ లో కనీసం 8 నుంచి 10 మంది సిబ్బంది ఉంటారు. అయితే జక్కన్న నయా రూల్ తో ఇప్పుడు కేవలం ఒకరిద్దరిని సెట్లోకి అనుమతిస్తుండటంతో సదరు స్టార్లు కాస్త ఇబ్బంది పడుతున్నారట. కానీ వాళ్లు రాజమౌళి రూల్ కు తలొంచక తప్పడం లేదు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *