టాలీవుడ్ నటి హేమ (Actress Hema) గురించి తెలియని వారుండరు. ఇప్పుడంటే డ్రగ్స్ కేసు.. ఇతర వివాదాలు గుర్తొస్తుంటాయి కానీ.. ఒకప్పుడు ఆమె సినిమాల్లో చాలా బిజీ ఆర్టిస్టు. ఏ సినిమా చూసినా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఈమే కనిపించేది. చాలా చిత్రాల్లో తల్లిగా, అక్కగా, వదినగా, అమాయక భార్యగా కనిపించి తన నటనతో అలరించింది. ఇక మహేశ్ బాబు నటించిన అతడు (Athadu Movie) సినిమాలో బ్రహ్మానందం భార్యగా హేమ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
అక్కడ దొరికేసింది
అయితే ఇన్నాళ్లు సినిమాలతో బిజీగా ఉన్న హేమ ఇటీవల డ్రగ్స్ కేసు (Hema Drugs Case)లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ కేసు నుంచి బయటపడినా దాని తాలూకూ జ్ఞాపకాలు ఇంకా ఆమెను వీడినట్లు లేవు. ఈ కేసు వ్యవహారం తర్వాత హేమ లైమ్ లైట్ కు కాస్త దూరంగా ఉంటోంది. ముఖ్యంగా మీడియా కంట పడటం లేదు. అయితే తాజాగా ఓ షాపింగ్ మాలో ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొంది హేమ. ఇక అక్కడ మీడియాకు దొరికేసింది. దీంతో వాళ్లు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు.
సినిమాలకు బై..బై..
ఈ నేపథ్యంలో హేమ మాట్లాడుతూ తాను ఇకపై సినిమాలు చేయనని చెప్పేసింది. సినిమాల్లో యాక్ట్ చేయడం మానేశానని ప్రస్తుతం తాను చిల్ అవుతున్నానని చెప్పుకొచ్చింది. “ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాను. నాకు 14 ఏళ్లప్పటి నుంచి సినిమాల్లో కష్టపడ్డాను. ఇన్నేళ్లు చాలా కష్టపడి పని చేశాను. ఇక చాలు అనిపించింది. అందుకే ఇప్పుడు సినిమాలకు బైబై చెప్పి జాలీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇక ఖాళీగా ఉండింది చాలు బోర్ కొట్టేస్తోంది అని నాకు మళ్లీ అనిపిస్తే అప్పుడు సినిమాల గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతం నాతో నేను ప్రేమలో ఉన్నాను”. అంటూ చెప్పుకొచ్చింది హేమ.






