పోకిరి, దేశముదురు వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయాడు. ఎన్నో హిట్లు కొట్టిన ఈ దర్శకుడు ఇప్పుడు ఒక్క డీసెంట్ హిట్ కోసం అష్టకష్టాలు పడుతున్నాడు. అయితే రామ్ పోతినేనితో తీసిన ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) మూవీతో ఇక పూరీ గాడిలో పడ్డాడని అంతా భావించారు. కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ ‘లైగర్ (Liger)’ మూవీతో మరో డిజాస్టర్ మూటకట్టుకున్నాడు. ఇక ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని ట్రై చేసి మళ్లీ బోల్తా పడ్డాడు.
Breaking News:
Puri Jagan recently narrated a script to Vijay Sethupathi, and the actor was instantly impressed, expressing his eagerness to take on the project immediately.
This will be a Telugu/Tamil film with Vijay Sethupathi in the lead role. Known for his deep… pic.twitter.com/cRBHIghHON
— idlebrain jeevi (@idlebrainjeevi) March 17, 2025
సేతుపతితో పూరీ సినిమా
ఈ క్రమంలో పూరీతో సినిమా చేసేందుకు తెలుగు హీరోలెవరూ ముందుకు రావడం లేదట. ఈ నేపథ్యంలోనే ఆయన కోలీవుడ్ హీరోలను లైన్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే పూరీతో సినిమా చేసేందుకు తమిళ్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ముందుకు వచ్చినట్లు సమాచారం. మహారాజ, విడుదల వంటి సినిమాలతో ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన విజయ్ సేతుపతితో పూరీతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
పూరీ-సేతుపతి బెగ్గర్ మూవీ
పూరీ జగన్నాథ్- విజయ్ సేతుపతి సినిమాకు ‘బెగ్గర్ (Beggar)’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. అయితే చాలా ఏళ్లుగా పూరీ తన సొంత బ్యానర్ పూరి కనెక్ట్స్ లో ఛార్మితో కలిసి సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఆయన చేయబోతున్న‘బెగ్గర్’ సినిమాను పూరి కనెక్ట్స్ రూపొందించడం లేదని సమాచారం. ఈ చిత్రాన్నిప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్ సంస్థ నిర్మించనున్నట్లు తెలిసింది. పూరీ జగన్నాథ్ చెప్పిన కథ నచ్చడంతో కెవిఎన్ ఈ సినిమా నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు టాక్.






