Court : బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతున్న ‘కోర్ట్’

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగానే కాదు నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు. ఆయన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాస్ పై ఇటీవల రూపొందించిన సినిమా కోర్ట్ : స్టేట్ వర్సెస్ నోబడీ (Court : State Vs Nobody). ప్రియదర్శి, శివాజీ, హర్ష రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలైన రోజు నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు రామ్ జగదీష్ తన తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టాడు.

కోర్ట్ వసూళ్లు

కోర్ట్ (Court Collections) డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆసక్తికరమైన కథనం, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాను నాని ప్రజెంట్ చేయడం, ప్రమోషన్స్ సమయంలో ఈ మూవీపై హైప్ క్రియేట్ చేయడం కూడా ఈ చిత్రానికి కలిసొచ్చింది. అందుకే బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.33.55 కోట్ల వసూళ్లు రాబట్టింది.

బాక్సాఫీస్ వద్ద కోర్ట్ కలెక్షన్స్

అమెరికాలో కూడా ఈ సినిమా సాలిడ్ కలెక్షన్లు (Court Collections in US) రాబడుతోంది. ఇప్పటికే 800K డాలర్ల మార్క్‌ను దాటిన ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకుంటోంది. సాధారణంగా లీగల్ డ్రామాలంటే బోర్ అనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతిని అందిస్తోంది. ఆరో రోజుకూడా బుకింగ్స్ స్ట్రాంగ్‌గా ఉండడంతో, ఈ సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *