టాలీవుడ్ హీరో నితిన్(Nitin), శ్రీలీల(Sreeleela) జంటగా నటించిన తాజా మూవీ ‘రాబిన్ హుడ్(Rabinhood)’. డైరెక్టర్ వెంకీ కుడుముల(Venky Kudumula) డైరెక్షన్లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిసున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event) తాజాగా హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) హాజరు కావడం విశేషం. కాగా ఏఆర్ రెహమాన్ మేనల్లుడు GV ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ మూవీ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అందరికీ నమస్కారం అంటూ
కాగా రాబిన్ హుడ్ చిత్రంలో ఓ పాత్ర పోషించిన డేవిడ్ వార్నర్… ప్రీరిలీజ్ ఈవెంట్(Pre Release Event)లో అఫీషియల్ ట్రైలర్(Trailer)ను రిలీజ్ చేశాడు. అంతేకాదు, నితిన్, శ్రీలీల, కేతికా శర్మ(Kethika Sharma)లతో కలిసి వేదికపై ‘అదిదా సర్ ప్రైజు సాంగ్’కి డ్యాన్స్ కూడా చేశాడు. ‘అందరికీ నమస్కారం’ అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన వార్నర్ తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుముల, హీరో నితిన్, నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పాడు. ట్రైలర్ రిలీజ్ చేసిన సందర్భంగా పుష్ప చిత్రంలో అల్లు అర్జున్లా నడిచి చూపించాడు.
From Post-Match Presentation Speeches To Telugu Movie Pre-Release Event Speech. pic.twitter.com/zhXLXC3Mng
— Aakashavaani (@TheAakashavaani) March 23, 2025
కాగా, రాబిన్హుడ్ ట్రైలర్లో వార్నర్ కూడా ఉన్నాడు. అతడు లాలిపాప్ తింటూ హెలికాప్టర్ నుంచి దిగడం చూపించారు. మరి ట్రైలర్ ఎలా ఉందో మీరూ చేసేయండి..






