I LOVE WARNER.. మాజీ క్రికెటర్‌కు సారీ చెప్పిన రాజేంద్ర ప్రసాద్

సీనియర్ నటుడు, కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌(David Warmer)కు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు రాజేంద్ర ప్రసాద్ సోషల్ మీడియా(SM) వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇటీవల ‘రాబిన్‌హుడ్’ (Robinhood) ప్రీరిలీజ్ ఈవెంట్‌(Pre Release Event)లో వార్నర్‌పై ఆయన చేసిన కామెంట్స్‌పై విమర్శలు రాగా.. దీనిపై తాజాగా ఆయన స్పందించారు.

నితిన్, వార్నర్ నాకు పిల్లల్లాంటివారు..

తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి కామెంట్స్ చేయలేదని.. సరదాగా తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని రాజేంద్రప్రసాద్ అన్నారు. ”I LOVE DAVID WARNER. I LOVE CRICKET’. డేవిడ్ వార్నర్ మన సినిమాలు, నటనను ఇష్టపడతారు. ఈ సినిమాతో ఒకళ్లకు ఒకళ్లం బాగా క్లోజ్ అయిపోయాం. నితిన్, వార్నర్ నాకు పిల్లల్లాంటివారు. నా కామెంట్స్ వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. అలాంటిది ఇంకెప్పుడూ జరగదు. జరగకుండా చూసుకుంటాను.’ అంటూ వీడియోలో చెప్పారు.

రేయ్ వార్నరూ.. బీ వార్నింగ్’ అంటూ..

కాగా ‘రాబిన్‌హుడ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్పెషల్ గెస్ట్‌గా డేవిడ్ వార్నర్ హాజరయ్యాడు. ఆయన ఈ మూవీలో గెస్ట్ రోల్(Guest Role) చేశారు. ఈ వేడుకలో నటుడు రాజేంద్రప్రసాద్ సైతం ప్రసంగించారు. ఈ సందర్భంగా వార్నర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. వార్నర్ క్రికెట్‌ ఆడమంటే పుష్ప సినిమాలో స్టెప్పులు వేస్తున్నాడంటూ తెలిపారు. ‘దొంగ…. కొడుకు మామూలోడు కాదండీ వీడు. రేయ్ వార్నరూ.. బీ వార్నింగ్’ అంటూ కామెంట్ చేశారు. అయితే, తెలుగు తెలియని వార్నర్ ఈ వ్యాఖ్యలకు సరదాగా నవ్వుకున్నాడు. కానీ ఆయన వ్యాఖ్యలు వార్నర్ ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు.

ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు ‘రాబిన్‌హుడ్’

దీంతో ఆయనపై వార్నర్.. తెలుగు సంస్కృతి, సినిమాలను చాలా ఇష్ట పడతారని.. అలాంటి వ్యక్తిని అవమానించడం ఏంటి? అంటూ ప్రశ్నించారు. ఆయన సినిమాపై అభిమానంతో ప్రత్యేక అతిథి(Special Guest)గా ఈవెంట్‌కు వచ్చారని.. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని కొందరు విమర్శించారు. తాజాగా రాజేంద్ర ప్రసాద్.. తన కామెంట్స్ పట్ల క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. ఇక ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని భావిస్తున్నానన్నారు. నితిన్(Nitin), శ్రీలీల(Sreeleela) జంటగా వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వంలో ‘రాబిన్‌హుడ్’ మూవీ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *