ఇక ఫ్యాన్స్ కు పండగే.. రామ్ చరణ్ ‘పెద్ది’పై చిరంజీవి కామెంట్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు, కుటుంబ సభ్యులు, అభిమానులు చెర్రీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు చరణ్ బర్త్ డే సందర్భంగా RC16 మూవీ నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్స్ ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో పాటు టైటిల్ కూడా రివీల్ చేశారు.

Image

అభిమానులకు ఇక పండగే

రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి ‘పెద్ది (Peddi)’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఈ అప్డేట్ పై చెర్రీ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. రామ్‌చరణ్‌ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన ప్రత్యేకంగా విషెస్‌ తెలిపారు. పోస్టర్‌లో చరణ్‌ లుక్‌ చాలా అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు. ఇది తప్పకుండా సినీ ప్రియులకు ఇది ఒక మంచి ట్రీట్‌ అవుతుందని చెప్పారు.

ఇంటెన్స్‌గా పెద్ది

‘‘హ్యాపీ బర్త్‌డే మై డియర్‌ చరణ్‌. ‘పెద్ది’ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తుంది. నీలోని నటుడిని మరో కొత్త కోణంలో ఇది ఆవిష్కరించనుంది. అభిమానులకు ఇది కనులపండుగ కానుందని నమ్ముతున్నాను’’ అంటూ చిరంజీవి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. స్పోర్ట్స్‌ నేపథ్యంలో ‘పెద్ది’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు (Buchibabu Sana) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యేందుకు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *