పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్, హను రాఘవపూడితో ఫౌజీ (వర్కింగ్ టైటిల్), సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్, ప్రశాంత్ వర్మతో బక (వర్కింగ్ టైటిల్), ప్రశాంత్ నీల్ తో సలార్ పార్ట్-2, నాగ్ అశ్విన్ తో కల్కి పార్ట్-2.. ఇలా వరుస లైనప్ లతో తీరిక లేకుండా ఉన్నాడు. ఒక సినిమా అయిపోగానే ప్రమోషన్లు, మరో మూవీ షూటింగు ఇలా నిత్యం సినిమాలతోనే గడుపుతున్నాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్ ఫోకస్ అంతా తన కెరీర్ పైనే ఉంది. ఈ సినిమాలన్నీ పూర్తయ్యే వరకు మరో మూడు నాలుగేళ్లు పడుతుంది.
తెరపైకి ప్రభాస్ మ్యారేజ్
అయితే ప్రభాస్ సినిమాల గురించే కాదు ఆయన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఆయన అభిమానులు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ప్రభాస్ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. సాధారణంగా తమ అభిమాన హీరో పెళ్లి చేసుకుని సెటిల్ అయితే ఫ్యాన్స్ బాధపడుతుంటారు ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్. కానీ డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం అలా కాదు. ప్రభాస్ పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యి హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. అందుకే ఎప్పుడెప్పుడు డార్లింగ్ మ్యారేజ్ న్యూస్ చెబుతాడా అని ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు సతీమణి కనిపించిన ప్రతిసారి ప్రభాస్ పెళ్లి గురించే అడుతుంటారు కూడా.
వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి
అయితే తాజాగా మరోసారి డార్లింగ్ పెళ్లి ముచ్చట తెరపైకి వచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెతో రెబల్ స్టార్ వివాహం జరగనుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్లీ అవే వార్తలు బలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీలోని గణపవరానికి చెందిన అమ్మాయితో ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్ అయినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఆ ఫ్యామిలీ ప్రస్తుతం వ్యాపారపరంగా హైదరాబాద్ లో సెటిల్ అయిందంట. వీరి ఫ్యామిలీ హైదరాబాద్ లో సెటిల్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పెళ్లి కబురుపై ప్రభాస్ టీమ్ స్పందిస్తూ ఇందులో వాస్తవం లేదని, అవన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది.






