కంటెంట్ నచ్చితే చాలు తెలుగు సినిమా అయినా మలయాళం మూవీ అయినా ఓకే అంటున్నారు టాలీవుడ్ ఆడియెన్స్. కథలో బలముంటే చాలు స్టార్ హీరో అయినా డెబ్యూ హీరో అయినా నో ప్రాబ్లెం అంటున్నారు. ఇక స్టార్ డైరెక్టరా.. నాలుగైదు హిట్లున్నాయా.. లేక ఇదే తొలి సినిమానా.. నేటి ప్రేక్షకులు ఇవేం చూడటం లేదు. కథ నచ్చిందా.. టేకింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉందా.. చిన్న సినిమా అయినా సూపర్ హిట్ చేసేస్తున్నారు. అలా ఇప్పటికే చాలా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.
బాక్సాఫీస్ వద్ద కోర్ట్ సెన్సేషన్
ఈ కోవలోకే వస్తుంది తాజాగా రిలీజ్ అయిన ‘కోర్ట్ (Court)’ సినిమా. నేచురల్ స్టార్ నాని (Actor Nani) నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం మార్చి 14వ తేదీన రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రముఖ నటుడు ప్రియదర్శి కీలక పాత్రలో నటించిన కోర్ట్ సినిమాలో.. శ్రీదేవి, హర్ష్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. నటుడు శివాజీ ఓ కీ రోల్ ప్లే చేశాడు. దర్శకుడు రామ్ జగదీష్ (Ram Jagadish) తన తొలి ప్రయత్నంతోనే సూపర్ సక్సెస్ కొట్టాడు. తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న కోర్ట్ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.
నెట్‌ఫ్లిక్స్ లో కోర్ట్
థియేటర్లో బ్లాక్ బస్టర్ అయి విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందా అని మూవీ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ (Court Ott Details) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోర్ట్ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈనెల 11వ తేదీ నుంచి కోర్ట్ మూవీ ఓటీటీ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.






