Mirai : తేజ సజ్జ ‘మిరాయ్’ మూవీలో దగ్గుబాటి రానా

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) చైల్డ్ ఆర్టిస్టుగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ‘హను-మాన్ (Hanu-Man)’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ సంపాదించాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘మిరాయ్ (Mirai)’ సినిమాలో నటిస్తున్నాడు. మానవాళికి సవాల్‌గా మారిన ఒక అంతుచిక్కని రహస్యం కోసం సాహసం చేసే యువకుడిగా ఈ చిత్రంలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయి ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెంచేశాయి. పీపుల్స్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.

విలన్ గా మంచు మనోజ్

పీరియాడిక్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన లుక్ కూడా రిలీజ్ అయింది. చాలా రోజుల తర్వాత మనోజ్ వెండితెరపై సందడి చేయనున్నాడు. అది కూడా విలన్ పాత్రలో నటించనున్నాడు. ఆయన పాత్ర చాలా ఇంటెన్స్ ఉండనున్నట్లు సమాచారం. ఇక మిరాయ్ సినిమా ఆగస్టు 1వ తేదీన ప్యాన్ ఇండియా భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Image

మిరాయ్ మూవీలో దగ్గుబాటి రానా

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. మిరాయ్ సినిమాలో దగ్గుబాటి రానా (Daggubati Rana) భాగం కాబోతున్నట్లు తెలిసింది. అయితే మొదట ఓ పాత్రకు దుల్కర్ సల్మాన్ ను తీసుకోవాలని భావించిన మేకర్స్ ఆయన డేట్స్ కుదరకపోవడంతో ఆయన స్థానంలో రానాను తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఆయన ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *