‘విశ్వంభర’ మెగా సర్​ప్రైజ్.. సినిమాలో పాట పాడనున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర (Vishwambhara)’. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే టీజర్ విడుదలై.. ఈ చిత్రంపై ప్రేక్షకులకు అంచనాలు పెంచేసింది. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశ్వంభర చిత్రం కోసం మెగాస్టార్ తన గాత్రం అందించనున్నారట. ఇందులో ఆయన ఏకంగా ఓ పాట పాడనున్నారట.

చిరు పాట పాడితే థియేటర్లో పూనకాలే

ఈ చిత్రానికి అస్కార్ అవార్డ్ విన్నర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి (MM Keeravani) మ్యూజిక్​ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే చిరు ఈ మూవీలో ఓ సాంగ్ పాడనున్నారట. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.  కానీ, మెగా ఫ్యాన్స్ మాత్రం నెట్టింట ఈ న్యూస్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు.  మెగాస్టార్ వాయిస్ లో పాట వినేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. చిరు స్టెప్పేస్తేనే థియేటర్లో పూనకాలు పెట్టే ప్రేక్షకులు ఇక ఆయన పాట వింటే ఇక థియేటర్ల దద్దరిల్లిపోవాల్సిందే.

అద్భుతమైన సీజీ వర్క్స్

ఇప్పటి వరకు మెగాస్టార్ పలు సినిమాల్లో తన గాత్రం వినిపించిన విషయం తెలిసిందే. ఆ పాటలన్నీ సూపర్ హిట్ అయ్యారు. ముఖ్యంగా మృగరాజు మూవీలో ఛాయ్ గురించి పాడిన పాట ఇప్పటికీ పాపులరే. ఇక ఈ సినిమాలో త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తోంది. ఆషికా రంగనాథ్‌,  కునాల్‌ కపూర్‌ (Kunal Kapoor) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్​, సీజీ వర్క్స్ అద్భుతంగా ఉండబోతున్నాయని టాక్. రూ.200 కోట్ల​తో యూవీ క్రియేషన్స్ బ్యానర్​పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *