Hyderabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టు సరికొత్త రికార్డు

హైదరాబాద్ శంషాబాద్​లోని రాజీవ్​గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport) మరో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రయాణికుల రాకపోకల్లో 15.20 శాతం వృద్ధిని సాధించి దేశంలోని అగ్రశ్రేణి విమానాశ్రయాల కంటే ఎగువన నిలిచింది.  గత ఆర్థిక సంవత్సరం 2024-25లో శంషాబాద్​ విమానాశ్రయం నుంచి మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణించినట్లు గణాంకాలు వెల్లడించాయి. ఇదే రద్దీ కంటిన్యూ అయితే వచ్చే ఏడాది ఈ సంఖ్య మూడు కోట్లు దాటే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

3 నెలల్లో 74 లక్షల ప్రయాణికులు

2024-25 ఏడాదిలో చివరి 3 నెలలు జనవరి నుంచి మార్చి వరకు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల్లో హైదరాబాద్ ఎయిర్ పోర్టు (Hyderabad Airport) అరుదైన రికార్డు సృష్టించింది. ఈ మూడు నెలల్లో ఏకంగా 74 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఈ విషయంలో హైదరాబాద్​ మహానగరం.. జనాభాలో ముందున్న మెట్రో నగరాలు చెన్నై, కోల్​కతాలను దాటేసిందని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

ఒక్కరోజే 94వేల మంది రాకపోకలు

రోజువారీ గరిష్ఠ సగటు ప్రయాణికుల సంఖ్యను 75 వేలను కూడా శంషాబాద్ ఎయిర్ పోర్టు (Shamshabad Airport) జనవరి 18న అధిగమించింది. ఆ ఒక్కరోజే 94 వేల మంది రాకపోకలు సాగించారు. హైదరాబాద్​లో తరచూ జాతీయ, అంతర్జాతీయ సదస్సులు జరుగుతుండటం వంటి పరిణామాలు ప్రయాణికుల వృద్ధికి దోహదం చేస్తున్నాయని అధికారులు ్ంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్​ నుంచి దుబాయ్, అబుధాబి, దోహా వంటి విదేశీ నగరాలకు అధికంగా ప్రయాణికులు వెళ్తున్నారని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *