Peddi: ‘పెద్ది’ మూవీ నిజమైన గేమ్ ఛేంజర్ అవుతుంది: రాంగోపాల్ వర్మ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు సానా(Bucchibabu Sana) కాంబిలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది(Peddi)’. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. చెర్రీ నటిస్తున్న ఈ సినిమాను వ్రిద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. జగపతి బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్(Shivaraj Kumar), దివ్యేందు శర్మ వంటి నటులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్(First look poster), ఫస్ట్ షాట్ గ్లింప్స్(First Shot Glimpse) ఊహించని రేంజ్‌లో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సానా బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది మూవీపై ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Director Ram Gopal Varma) స్పందించారు. పెద్ది అసలైన, నిజమైన గేమ్ ఛేంజర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని పేర్కొన్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ గ్లోబల్(Global) స్థాయిలో కాదు, యూనివర్సల్(Universal) స్థాయిలో కనిపిస్తున్నాడని కితాబిచ్చారు.

సినిమా గ్యారంటీగా ట్రిపుల్ సిక్సర్

‘హేయ్ సానా బుచ్చిబాబు… రాజమౌళి(Rajamouli) నుంచి నా వరకు ఏ దర్శకుడు కూడా రామ్ చరణ్ శక్తిని నువ్వు అర్థం చేసుకున్నంత ఎక్కువగా మేం అర్థం చేసుకోలేకపోయాం. నీ సినిమా గ్యారంటీగా ట్రిపుల్ సిక్సర్(Triple Sixer) కొడుతుంది’ అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్ వీడియోను షేర్ చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *