ఐపీఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్(RR)తో జరుగుతున్న మ్యాచులో గుజరాత్ టైటాన్స్(GT) 217 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు 3వ ఓవర్లోనే షాక్ తగిలింది. కెప్టెన్ గిల్ (2) పరుగులకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (82)కి సూపర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అటు బట్లర్ (36) సైతం ఉన్నంత సేపు బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
Sai Sudharsan in Ahmedabad –
Innings – 15
Runs – 822
Avg – 58.71
SR – 156.27
50s/100s – 6/1 pic.twitter.com/uhZ6E7JUW7— Satish Mishra 🇮🇳 (@SATISHMISH78) April 9, 2025
ఈ క్రమంలో జట్టు స్కోరు 94 పరుగుల వద్ద బట్లర్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన షారుఖ్ ఖాన్ (36), రాహుల్ తెవాటియా, రషీద్ (12) రన్స్ చేయడంతో టైటాన్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 రన్స్ చేసింది. రాయల్స్ బౌలర్లలో తుషార్ 2, తీక్షణ 2 వికెట్లు తీయగా, ఆర్చర్, సందీప్ చెరో వికెట్ పడగొట్టారు. రాయల్స్ గెలవాలంటే 20 ఓవర్లలో 218 రన్స్ చేయాలి.






