Raama Raama : చిరంజీవి ‘విశ్వంభర’ నుంచి ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియ‌న్ సినిమా విశ్వంభ‌ర. మెగాస్టార్ చిరంజీవి, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. హునుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 12వ తేదీన రామ రామ అంటూ ఫ‌స్ట్ సింగిల్‌ రిలీజ్ చేయనున్నారు.

రామ రామ సాంగ్ ప్రోమో

ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి ఇవాళ రామ రామ సాంగ్ ప్రోమో షేర్ చేశారు. రామ రామ అంటూ ఫుల్ ఎనర్జిటిక్‌గా సాగిన ఈ ప్రోమో మెగా అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించారు. ఈ చిత్రానికి బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మెగా-అనిల్ ఫిల్మ్ అప్డేట్

ప్రస్తుతం ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఇక రేపు ఈ చిత్రం నుంచి సింగిల్ విడుదల కానుండగా.. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మూవీ తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడితో ఓ మూవీ చేయనున్నారు. ఇటీవలే ఈ చిత్ర పూజా కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫిల్మ్ తర్వాత మెగాస్టార్ శ్రీకాంత్ ఓదెలతో మరో మూవీ చేయనున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *