శ్రీరామ దూత అయిన హనుమాన్ జయంతి(Hanuman Jayanthi)ని రేపు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఏటా చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని నిర్వస్తుంటారు. ఈ పవిత్రమైన రోజున హిందువులు(Hindus), హనుమాన్ భక్తులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ అంజన్నను పూజించి ప్రత్యేకమైన ఉపవాసాలు ఉంటారు. హనుమాన్ చాలీసా(Hanuman Chalisa) పఠించడంతో పాటు శ్రీ రామనామ జపం చేస్తారు. ఇక హనుమాన్ జయంతిని ప్రతి సంవత్సరం హైదరాబాద్(Hyderabda)లో చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇక ఏడాది కూడా భాగ్యనగరంలో అంజన్న శోభాయాత్ర(Hanuman Shobhayatra)కు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు అన్ని మద్యం దుకాణాలు(Wine Shops) మూసివేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు బార్లు, కల్లు దుకాణాలు కూడా పూర్తిగా మూసివేయాలని పోలీసులు స్పష్టం చేశారు. పోలీస్ శాఖ జారీ చేసిన ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్(CP) హెచ్చరించారు.

ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు
ఇక హనుమాన్ జయంతి సందర్భంగా పోలీసులు రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic restrictions) విధించారు. హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమయ్యే గౌలిగూడ ‘రామ్ మందిర్(Gauliguda Ram Mandir)’ నుంచి పుత్లిబౌలి క్రాస్ రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ క్రాస్ రోడ్స్, కోఠి, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, రామ్‌కోఠి క్రాస్ రోడ్స్, కాచిగూడ X రోడ్స్, నారాయణగూడ YMCA, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్, RTC X రోడ్స్, అశోక్ నగర్, గాంధీ నగర్ బ్యాక్ సైడ్ వైశ్రాయ్ హోటల్, ప్రాగా టూల్స్, కవాడిగూడ, CGO టవర్స్, బన్సీలాల్‌పేట రోడ్, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూమ్, ఉజ్జయినీ మహంకాళి టెంపుల్, ఓల్డ్ రామ్‌గోపాల్‌పేట రోడ్, ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, CTO జంక్షన్, లీ రాయల్ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపిరీయల్ గార్డెన్, మస్తాన్ కేఫ్ మీదుగా తాడ్బండ్లోని హనుమాన్ మందిర్ వరకు కొనసాగే ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఆయా రూట్లలో పోలీసులతో భారీ బందోబస్త్(Heavy deployment) ఏర్పాటు చేయనున్నారు.
𝗧𝗿𝗮𝗳𝗳𝗶𝗰 𝗔𝗱𝘃𝗶𝘀𝗼𝗿𝘆 𝗳𝗼𝗿 “𝗦𝗿𝗶 𝗛𝗮𝗻𝘂𝗺𝗮𝗻 𝗝𝗮𝘆𝗮𝗻𝘁𝗵𝗶 𝗩𝗶𝗷𝗮𝘆𝗮 𝗬𝗮𝘁𝗵𝗿𝗮”, 𝗣𝗿𝗼𝗰𝗲𝘀𝘀𝗶𝗼𝗻 𝗳𝗿𝗼𝗺 𝗚𝗼𝘄𝗹𝗶𝗴𝘂𝗱𝗮 𝗥𝗮𝗺 𝗠𝗮𝗻𝗱𝗶𝗿 𝘁𝗼 𝗧𝗮𝗱𝗯𝘂𝗻𝗱 𝗛𝗮𝗻𝘂𝗺𝗮𝗻 𝗧𝗲𝗺𝗽𝗹𝗲 𝗮𝗻𝗱 𝗳𝗿𝗼𝗺 𝗞𝗮𝗿𝗺𝗮𝗻𝗴𝗵𝗮𝘁 𝗛𝗮𝗻𝘂𝗺𝗮𝗻… pic.twitter.com/XlWZTUa6Lw
— Hyderabad City Police (@hydcitypolice) April 11, 2025






