మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న మూవీ ‘విశ్వంభర(Vishwambhara)’. ‘బింబిసారా’ ఫేమ్ మల్లిడి వశిష్ఠ మల్లాడి(Director Vasista Malladi) దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సోషియో ఫాంటసీ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష(Trisha)తో పాటు కునాల్ కపూర్, ఆషికా రంగనాథ్, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్(Janvi Kapoor) మొత్తం ఐదుగురు కథానాయికలుగా నటిస్తున్నారు.
ఫుల్ ఎనర్జీటిక్‌గా ప్రోమో
ఈ చిత్రం నుంచి ఫస్ట్ పాట(First Song)ను హనుమాన్ జయంతి(Hanuman Jayanthi) కానుకగా శనివారం (ఏప్రిల్ 12న) విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ‘రామ రామ’ అంటూ సాగే ఈ ఫుల్ సాంగ్‌ను ఇవాళ ఉదయం 11.12 గంటలకు విడుదల కానుంది. ఇక ఫుల్ ఎనర్జీటిక్‌గా సాగిన ఈ సాంగ్ ప్రోమో(Rama Rama Song Promo మెగా అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం కీరవాణి బాణీలు సమకూర్చిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి(Ramajogayya Sastry) లిరిక్స్ అందించారు. కాగా ఈ మూవీ జులై 24న థియేటర్లలోకి వచ్చే అవకాశం ముంది.
This Hanuman Jayanthi, let us all turn Ramadoothas and sing the glory of Lord Rama 🏹#Vishwambhara First Single #RamaRaama promo out now!
▶️ https://t.co/4Rt3cNTKeIFull song out on 12thApril 11:12 AM ❤️🔥
Music by the Legendary @mmkeeravaani 🛐
Lyrics by ‘Saraswatiputra’… pic.twitter.com/HF3UHzoXS0— UV Creations (@UV_Creations) April 11, 2025






