నేచురల్ స్టార్ నాని (Nani) ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ లో వచ్చిన హిట్ ఫ్రాంఛైజీలో మరో సినిమా వచ్చేసింది. ఇప్పటికే వచ్చిన హిట్-1, హిట్-2 బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ రెండు చిత్రాలు నాని నిర్మించాడు. ఇక ఈ ఫ్రాంఛైజీలో వస్తున్న హిట్ : ది థర్డ్ కేసు (HIT : The 3rd Case)లో స్వయంగా నాని హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. కేజీయఫ్ ఫేం శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ఫీ మేల్ లీడ్ లో కనిపించనుంది.
అబ్ కీ బార్ అర్జున్ సర్కార్
ఈ మూవీలో నాని అర్జున్ సర్కార్ పాత్రలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్ ప్రేక్షకులకు ఈ చిత్రంపై అంచనాలు పెంచేశాయి. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ (HIT 3 Trailer) రిలీజ్ చేశారు. అబ్ కీ బార్ అర్జున్ సర్కార్ అంటూ నాని ఈ ట్రైలర్ తన విశ్వరూపం చూపించాడు. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి, యునానిమస్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ మే 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.






