ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సతీమణి అన్నా లెజినోవా(Anna Lezhneva) హిందూ ధర్మంపై తనకున్న నమ్మకాన్ని మరోసారి చాటుకున్నారు. ఆదివారం రాత్రి తిరుమల చేరుకున్న ఆమె. శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమల(Tirumala)లోని గాయత్రి సదనంలో TTD ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాల(Declaration Papers)పై సంతకం చేశారు. అనంతరం క్షేత్ర సంప్రదాయం నియమాలను పాటించారు. ముందుగా ఆలయ మాడ వీధుల్లోకి చేరుకుని శ్రీ భూ వరహాస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ దర్శనమనంతరం కళ్యాణకట్టకు చేరుకుని తలనీలాలు సమర్పించారు.
తిరుమలేశుని సేవలో శ్రీమతి అన్నా కొణిదల గారు
• కుమారుడు మార్క్ శంకర్ పేరిట నిత్యాన్నదానానికి రూ. 17 లక్షల విరాళం
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సతీమణి శ్రీమతి అన్నా కొణిదల గారు దర్శించుకున్నారు. సోమవారం… pic.twitter.com/jM7dvlWjPd
— JanaSena Party (@JanaSenaParty) April 14, 2025
ఇక ఇవాళ వేకువజామున శ్రీవారి(Tirumala Venkateswara Swamy)ని దర్శించుకొని మొక్కులు అప్పగించారు. ఆమెకు ఆలయాధికారులు వేద ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అంజేశారు. ఇక అక్కడి నుంచి తిరుమల శ్రీతరిగొండ వెంగమాంబ అన్నసత్రానికి చేరుకున్న ఆమె పవన్ తరఫున విరాళం ఇచ్చారు. అనంతరం ఆమె స్వయంగా భక్తులకు అన్నం వడ్డించారు. తర్వాత భక్తుల కలిసి తానూ అన్నసత్రంలోనే భోజనం చేశారు. కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) పేరిట రూ.17 లక్షలను అందించారు. ఇటీవల అగ్నిప్రమాదం(Fire Accident) నుంచి మార్క్ బయటపడిన విషయం తెలిసిందే. దీంతో ఆమె శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.






