Rabinhood Ott: నితిన్ ‘రాబిన్‌హుడ్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్?

హీరో నితిన్(Nitin), అందాల భామ శ్రీలీల(Sreelaala) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్‌హుడ్(Rabinhood). చలో, భీష్మ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్ మీద అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ మూవీ మార్చి 28న థియేటర్లలోకి వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మిక్సిక్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో నటించాడు. అటు కేతిక శర్మ(Kethika Sharma) ఐటెం సాంగ్ కుర్రకారును తెగ ఆకట్టుకుంది.

అత్యంత భారీ రేటుకు తెలుగు రైట్స్

ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త టీటౌన్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ మూవీ థియేట్రికల్ రన్‌ని కూడా పూర్తి చేసుకుంది. దీంతో ఈ చిత్రం ఓటీటీ రిలీజ్(OTT Release) డేట్ లాక్ అయ్యినట్టుగా సమాచారం. ఈ సినిమా OTT రైట్స్ ZEE5 సంస్థ కొనుగోలు చేయగా శాటిలైట్ రైట్స్ ZEE తెలుగు దక్కించుకుందట. నితిన్ కెరీర్‌లోనే అత్యంత భారీ రేటుకు తెలుగు రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని మే 2వ తేదీ నుంచి ZEE5లో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది. దీనిపై మూవీ టీమ్ స్పందించాల్సి ఉంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *