స్థిరంగా పసిడి ధరలు.. అయినా కొనలేని పరిస్థితి

ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వైఖరితో ప్రపంచ దేశాలు తిప్పలు పడుతున్నాయి. ట్రంప్ సుంకాలతో ఒక్కసారిగా చాలా దేశాలపై పెను భారం పడింది. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి గోల్డ్ రేట్లు అమాంతం పెరిగాయి. ఇప్పటికే రికార్డు స్థాయిని దాటిన పుత్తడి ధరలు రోజురోజుకు పెరుగుతూ సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి.

ఎవడ్రా నన్ను ఆపేది?

ఎవడ్రా నన్ను ఆపేది అంటూ అంతు లేకుండా బంగారం రేట్లు (Gold Rates Today) రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక మరో నాలుగైదు రోజుల్లో పసిడి రేట్లు రూ.లక్షకు చేరువయ్యేలా ఉన్నాయి. నిన్నటి దాకా భారీగా పెరుగుతూ వచ్చిన పుత్తడి రేటు ఇవాళ స్థిరంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.97,580 వద్ద పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం తులం రేటు రూ.89,450 వద్ద ఉంది.

స్థిరంగా వెండి ధరలు

బంగారంతో పాటు వెండి ధరలు (Silver Price Today) కూడా పరుగు పెడుతున్నాయి. నిన్న ఒక్కసారిగా రెండు వేల రూపాయలకు పైగా పెరిగిన సిల్వర్ రేటు ఇవాళ స్థిరంగా ఉంది. హైదరాబాద్ లో శనివారం రోజున కేజీ సిల్వర్ ధర రూ.97,898గా ఉంది. ఈ ధరలు చూసి సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఇలా అయితే బంగారం కొనుగోలు చేసేదెలా అని వాపోతున్నారు. శుభకార్యాలు సమీపిస్తున్న వేళ గోల్డ్ రేట్లు కాస్త తగ్గుముఖం పడితే బాగుండు అని ఆశిస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *