మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు వార్-2 (War-2)తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షూటింగు పూర్తి చేసుకున్న తారక్ తర్వాత తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా తారక్.. కొత్త సినిమా సెట్లోకి అడుగు పెడుతున్నాడు. అందుకోసం ఆయన ఆదివారం ఉదయం కర్ణాటకకు వెళ్లాడు. మంగళవారం నుంచి ఎన్టీఆర్ తన కొత్త మూవీ షూటింగులో పాల్గొననున్నాడు.
ఎన్టీఆర్-నీల్ మూవీ అప్డేట్
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashant Neel) కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి రూపొందిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ షెడ్యూల్ ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ పూర్తి చేశారు. ఇక నెక్స్ట్ షెడ్యూల్ లో తారక్ పాల్గొననున్నారు.
నీల్ సినిమా సెట్లో తారక్
ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా కర్ణాటక(NTR in Karnataka)కు వెళ్లారు. మంగళవారం నుంచి అక్కడ ప్రారంభం కానున్న నెక్స్ట షెడ్యూల్ షూటింగులో తారక్ పాల్గొంటారు. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై నీల్ కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు సమాచారం. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తారక్ ను ఊరమాస్ యాక్షన్ హీరోగా నీల్ చూపించబోతున్నారు.
డ్రాగన్ వర్కింగ్ టైటిల్
ఎన్టీఆర్ – నీల్ సినిమా పీరియాడిక్ కథతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ (Rukmini vasanth)నటిస్తోందనే ప్రచారం సాగుతోంది. ఇక ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. కల్యాణ్‌రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.






