IPLలో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ప్లేయర్ KL రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్ర(IPL History)లో అత్యంత వేగంగా 130 ఇన్నింగ్స్‌ల్లోనే 5వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో అజేయంగా హాఫ్ సెంచరీ (57) చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (135 ఇన్నింగ్స్), విరాట్ కోహ్లీ (157 ఇన్నింగ్స్), AB డివిలియర్స్ (161 ఇన్నింగ్స్), శిఖర్ ధవన్ (168 ఇన్నింగ్స్) ఉన్నారు.
Hit a match winning half century,
Completed his 5000 runs in IPL,
Completed his 300 runs in IPL 2025,
Finished off the match in style with a SIX.KL Rahul did all this in front of Sanjiv Goenka. 🔥☠️ pic.twitter.com/3Zd4g595ng
— Atharv Shukla (@Atharb_) April 22, 2025
ఈరోజు నెగ్గకుంటే ప్లేఆఫ్స్ చేరడం కష్టమే
ఇక, రాహుల్ 46.35 సగటు, 135.70 స్ట్రైక్‌రేట్‌తో 5వేల రన్స్ పూర్తి చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే నాలుగుసార్లు డకౌట్ అయ్యాడు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో DC 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. LSG నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని DC కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించింది. ఇక ఇవాళ హైదరాబాద్(HYD)లోని ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్(SRH vs MI) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచులో ఓడిన జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి.






